లాంచ్ అయిన Vivo X90 5G: ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Vivo X90 సిరీస్
  • లైనప్ లో ఉన్న మోడల్స్: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+
  • హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు వివో ఫోన్లు హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. పవర్ఫుల్ కెమెరా, పవర్ఫుల్ ర్యామ్, ఫాస్ట్ ప్రాసెసర్ ఈ ఫోన్లలో ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన Vivo X90 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Vivo X90 5G స్పెసిఫికేషన్స్

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. పంచ్-హోల్ తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్ 1200 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 115% కలర్ గేముత్ ని కలిగి ఉంది. భద్రత కోసం Vivo X90 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo X90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన, 4ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో Immortalis-G715 GPU వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ LPPDDR5 RAM, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీపై పని చేస్తుంది.

Vivo X90 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo X90 5G లో 50MP Sony IMX866 ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఇంకా 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ (F/2.0), 12MP పొట్రెయిట్ లెన్స్ (F/1.98) తో కలిపి బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP (F/2.45) కెమెరా అందించారు.

Vivo X90 5G డ్యూయల్ మోడల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం USB Type-C 3.2 Gen1 తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Vivo X90 5G ధర

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ యొక్క 4 వేరియంట్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. రెండోది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, మూడోది 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, నాల్గోది 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ కలిగి ఉంటాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 8జిబి + 128జిబి మోడల్ ధర RMB 3699 (సుమారు రూ.42,400), 8జిబి + 256జిబి యూనిట్ ధర RMB 3,999 (సుమారు రూ.45,800), 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 4,999 (సుమారు రూ.57,200).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.