హైలైట్స్
- లీకైన iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్
- మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO Neo 7 SE
- ఇంకా రివీల్ కావాల్సియున్న లాంచ్ తేదీ
iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. తాజాగా లీక్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ చేశాడు. iQOO Neo 7 SE ఫోన్ కంపెనీ యొక్క మిడ్-రేంజ్ ఆఫరింగ్. ఇది త్వరలోనే చైనాలో లాంచ్ కానుందని సమాచారం. ఈలోపే రీసెంట్ గా లీకైన పోస్టర్ ద్వారా ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ ఏంటో తెలిసిపోయాయి. టిప్‌స్టర్ ఇషాన్ చెబుతున్న దాన్ని బట్టి, iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ రానుంది.
గతంలో లీక్ అయిన సమాచారాన్ని బట్టి, iQOO Neo 7 SE 50ఎంపి ఓఐఎస్ కెమెరా తో వస్తున్నట్లు తెలిసింది. అయితే ఇషాన్ చెబుతున్న దాన్ని బట్టి, 64ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉండనున్నట్లు వినికిడి.
iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)
iQOO Neo 7 SE లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.
iQOO Neo 7 SE కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం, ఈ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాతో వస్తుందని అనుకున్నారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ని, తాజా నివేదికలతో పోల్చితే తేడా కనిపిస్తోందని అర్థమవుతోంది. దీన్ని బట్టి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కూడా మారే అవకాశం ఉంది.
iQOO Neo 7 SE డివైజ్ ఇంటర్స్టెల్లార్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, గెలాక్సీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రానున్న రోజుల్లో ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్ కి సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












