Infinix Zero 5G 2023 ధరను ప్రకటించిన కంపెనీ

హైలైట్స్

  • గత నెలలో లాంచ్ అయిన Infinix Zero 5G 2023
  • లాంచ్ సమయంలో ధరను ప్రకటించని కంపెనీ, తాజాగా ప్రైస్ రివీల్ చేసిన ఇన్ఫినిక్స్
  • త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానున్న Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే లాంచ్ సమయంలో కంపెనీ ఈ ఫోన్ యొక్క ధర, లభ్యతను వెల్లడించలేదు. తాజాగా ఈ ఫోన్ ధరను సదరు సంస్థ ప్రకటించింది. Infinix Zero 5G 2023 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

ఇన్ఫినిక్స్ లేటెస్ట్ గా HOT 20 5G ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో సేల్ కి రానున్న Infinix Zero 5G 2023 తో కలిపితే ప్రస్తుతం ఇన్ఫినిక్స్ మూడు 5జీ స్మార్ట్ ఫోన్ లను ఆఫర్ చేస్తోంది.

Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ పంచ్ హోల్ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 1080*2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ రియల్మీ 9 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో+ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. అయితే, 2022 మోడల్ తో పోల్చితే 2023 జీరో 5జీ మోడల్ లో పెద్దగా తేడాలు ఏమీ లేవు. అయితే ప్రాసెసర్ మాత్రం కొత్త దాన్ని వాడారు.

Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉపయోగించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ని 5జిబి వరకు పెంచుకునేందుకు ఇందులో RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ఉంది.

Infinix ZERO 5G 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix ZERO 5G 2023 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. 60FPS 4కే వీడియో రికార్డింగ్, 960FPS స్లో-మో రికార్డింగ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

Infinix ZERO 5G 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix ZERO 5G 2023 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత XOS 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ ఉంది. n78, n77, n3, n5, n7 వంటి మేజర్ బ్యాండ్స్ తో పాటు ఇంకెన్నో బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. ఇంకా డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ ఇందులో ఉన్నాయి. పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Infinix ZERO 5G 2023 ధర, లభ్యత

Infinix ZERO 5G 2023 ధరను 239 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.19,400 గా ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధర మారవచ్చు. Infinix ZERO 5G 2023 సబ్ మరైన్ బ్లాక్, పర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.