హైలైట్స్
- ప్రస్తుతం Samsung Galaxy M04 పై పని చేస్తున్న శాంసంగ్ కంపెనీ
- భారత్ లో రూ.10,000 లోపే లభించనున్న ఫోన్
- తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఇమేజ్, డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్న Samsung Galaxy M04
Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలో లాంచ్ అవ్వనుంది. ఈ విషయం 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే మేం మీకోసం కొన్ని పోస్టర్ ఇమేజెస్ ని రాబట్టాం. ఈ పోస్టర్ ఇమేజ్ ని శాంసంగ్ రానున్న రోజుల్లో ప్రమోషన్ కోసం వాడనుంది. ఈ పోస్టర్ ఇమేజెస్ ఒక దానిలో Samsung Galaxy M04 ధర ఎంతో తెలిసింది. కచ్చితమైన ధర రూ.8,999 గా ఉంది. అయితే అప్పుడే మనం ఏ విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పలేం. ఈ హ్యాండ్సెట్ రియల్మీ సీ-సిరీస్ మరియు ఎంట్రీ లెవెల్ రెడ్మీ స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది.
ఇంకా చెప్పాలంటే, Samsung Galaxy M04 డివైజ్ డ్యూయల్ కెమెరాస్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు ప్రోమో ఇమేజెస్ ద్వారా అర్థమవుతోంది. టీజర్ ఇమేజెస్ లో ఒక దాని ద్వారా తెలిసిందేంటంటే, ఈ హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్ మరియు ఎక్స్‌ప్యాండబుల్ ర్యామ్ ని కలిగి ఉండనుంది. ఇక, ఈ ఫోన్ పిక్స్ లో మింట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ ఇంకా ఎక్కడా లాంచ్ కాలేదు. దీంతో స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. రీసెంట్ గా ఈ హ్యాండ్సెట్ Google Play Console లిస్టింగ్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ లో SM-M045F/DS అనే మోడల్ నంబర్ ని ఫోన్ కలిగి ఉంది. Samsung Galaxy M04 ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy M04 హ్యాండ్సెట్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. అయితే ఇతర ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
Samsung Galaxy M04 ఫోన్లో గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. Galaxy M04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Galaxy A04e ని పోలి ఉన్నాయి. అంటే, Samsung Galaxy M04 లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్పెసిఫికేషన్స్ పై కూడా మరింత స్పష్టత రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













