హైలైట్స్
- భారత్ లో లాంచైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Vivo Y02
- మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
- భారత్ లో Vivo Y02 ధర రూ.8,999
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo Y02 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ ఎవెల్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,000 లోపు పెట్టారు. ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉన్నాయి. ఓసారి Vivo Y02 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo Y02 ధర, లభ్యత
భారత్ లో Vivo Y02 ధరను రూ.8,999 గా నిర్ణయించారు. వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆర్కిడ్ బ్లూ మరియు కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y02 స్పెసిఫికేషన్స్
Vivo Y02 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే రెజుల్యూషన్ 720*1600 పిక్సెల్స్, యాస్పెక్ట్ రేషియో 20:9, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్, ఐ ప్రొటెక్షన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Vivo Y02 లో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ వాడారు. ఇది 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజీ కలిగి ఉంది.
ఇప్పుడు Vivo Y02 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y02 లో 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం Vivo Y02 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం యూఎస్బీ 2.0 చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఫుల్ బ్యాటరీ తో ఏకధాటిగా 18 గంటల పాటు ఆన్లైన్ హెచ్డీ వీడియో స్ట్రీమింగ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Vivo Y02 స్మార్ట్ ఫోన్ 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 75.64 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. ఓఎస్ విషయానికి వస్తే, Vivo Y02 ఆండ్రాయిడ్ 12 గో ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo Y02 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వోల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. Vivo Y02 లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1 టెరాబైట్ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












