హైలైట్స్
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14
- శాంసంగ్ ఇండియా వెబ్సైట్ లో కనిపించిన Samsung Galaxy A14
- SM-A146B/DS అనే మోడల్ నంబర్ కలిగి ఉన్న హ్యాండ్సెట్
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy A14
Samsung Galaxy A14 డివైజ్ శాంసంగ్ ఇండియా యొక్క సపోర్ట్ పేజీలో కనిపించింది. త్వరలోనే ఈ గెలాక్సీ-ఏ సిరీస్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది.
ఈ 5జీ మోడల్ SM-A146B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది తప్పా, ఫోన్ కి సంబంధించి ఇంకా ఏ విషయాలు తెలియలేదు. అయితే ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని దీని ద్వారా తెలుస్తోంది. Samsung Galaxy A13 కి సక్సెసర్ గా Samsung Galaxy A14 వస్తోంది.
రీసెంట్ గా లీకైన రెండర్ ఇమేజ్ ద్వారా Samsung Galaxy A14 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని తెలిసింది. మూడు సర్క్యులర్ కటౌట్స్ లో ఈ కెమెరాలు ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది.
Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ FCC వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో వివిధ 5జీ బ్యాండ్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఇంకా NBTC, Bluetooth SIG వెబ్ సైట్స్ పై కూడా కనిపించింది. దీంతో ఈ ఫోన్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుందని తెలిసింది.
Samsung Galaxy A14 రెండు ప్రాసెసర్ ఆప్షన్స్ తో వస్తోంది. అవి: మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్. Samsung Galaxy A14 లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్ 6.8-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. Samsung Galaxy A14 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Samsung Galaxy A14 యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













