OPPO Find N2 Flip గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights

  • వచ్చే నెలలో జరగనున్న MWC 2023 ఈవెంట్ లో లాంచ్ కానున్న OPPO Find N2 Flip
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip
  • ఆస్ట్రల్ బ్లాక్, మూన్‌లిట్ పర్ఫుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO Find N2 Flip

ఇటీవలె OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ ని చైనాలో విజయవంతంగా లాంచ్ చేసింది ఒప్పో. ఇప్పుడు ఈ దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గ్లోబల్ గా OPPO Find N2 Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. టిప్‌స్టర్ SnoopyTech ప్రకారం, OPPO Find N2 Flip గ్లోబల్ గా లేదా యూరప్ లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ సందర్భంగా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ స్పెయిన్ లోని బార్సిలోనా లో ఫిబ్రవరి 27 న ప్రారంభమై మార్చి 2 దాకా కొనసాగుతుంది.

టిప్‌స్టర్ OPPO Find N2 Flip యొక్క కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, కలర్ వేరియంట్స్, చిప్సెట్ వివరాలను వెల్లడించడం జరిగింది. భారత్ లో ఈ డివైజ్ త్వరలోనే లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి OPPO Find N2 Flip యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ తదితర విషయాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

OPPO Find N2 Flip గ్లోబల్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని అంచనా. అవి: ఆస్ట్రల్ బ్లాక్, మూన్‌లిట్ పర్పుల్. టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. చైనీస్ వేరియంట్ కూడా డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తోనే లాంచ్ అయ్యింది. ఇకపోతే ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Find N2 Flip డివైజ్ 6.8-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 21:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 3.26-ఇంచ్ గల మరొక డిస్ప్లే ఉంటుంది. ఇది 720*382 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

ఇప్పుడు OPPO Find N2 Flip యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ సెన్సర్, 8ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది. ఇండియా లాంచ్ తేదీ, అంచనా ధర ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన Moto G53 5G లైవ్ ఇమేజ్, రిటైల్ బాక్స్ కంటెంట్స్
Next articleAirtel రూ.719 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.