చవకైన DATA+OTT ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel

Highlights

  • మెల్లగా రూ.149 ప్రీపెయిడ్ డేటా+ఓటీటీ ప్లాన్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్ సంస్థ
  • రూ.149 ప్లాన్ తో కస్టమర్లకు లభించనున్న 1జిబి డేటా మరియు ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్
  • ఈ డేటా ప్యాక్ తో ఉచిత కాలింగ్, వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభించవు

దేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ కూడా ఒకటి. ప్రధానంగా జియోతో ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురవుతుంటుంది. ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం జియోకి షాకిచ్చేలా ఒక ప్లాన్ ని తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారతి ఎయిర్టెల్ సంస్థ సీక్రెట్ గా ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. రూ.149 విలువజేసే ప్లాన్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఇంటర్నెట్ డేటా, ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి. చవకైన ఎయిర్టెల్ డేటా ప్లాన్ కోసం మీరు చూస్తుంటే, ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది. సరే, ఓసారి ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు తెలుసుకుందాం పదండి.

Airtel రూ.149 ప్రీపెయిడ్ డేటా+ఓటీటీ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 1జిబి డేటా లభిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్రీమియమ్ కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రిమ్ యాప్ ద్వారా 15 కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ లభించనుంది. 15 ఓటీటీ సేవలు కేవలం ఎక్స్‌ట్రిమ్ యాప్ ద్వారా పొందే వీలుంది. మీ యొక్క ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్ లేదా డెస్క్‌టాప్ లలో Airtel Xstream Premium యాప్ అందించే కంటెంట్ ని చూడవచ్చు. ఈ యాప్ వ్యాలిడిటీ 30 రోజులు.

అయితే ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.149 ప్లాన్ ద్వారా 1జిబి డేటా ఒకేసారి లభిస్తుంది. మరి డేటా అధికంగా కావాలంటే ఈ ప్లాన్ తో పాటు అదనపు డేటా కోసం రూ.148 ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అధిక డేటా వస్తుంది. లేదంటే మరేదైనా డేటా వోచర్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన డేటాను బట్టి రీచార్జ్ ని ఎంచుకోండి. ఇప్పుడు రూ.148 డేటా ప్రయోజనాలు తెలుసుకుందాం.

Airtel రూ.148 ప్లాన్ తో మరింత డేటా

ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.148 ప్లాన్ తో అధిక డేటా ప్రయోజనం పొందవచ్చు. ఓటీటీ బెనిఫిట్స్ వద్దనుకుంటే గనుక, రూ.148 ప్లాన్ ని రీచార్జ్ చేసుకుంటే 15జిబి డేటా వస్తుంది. యూజర్ ప్రస్తుతం వాడుతోన్న ప్లాన్ వ్యాలిడిటీ ఈ డేటా ప్లాన్ కి వర్తిస్తుంది.

ఈ ఆర్టికల్ లో మీకు ఎయిర్టెల్ తీసుకొచ్చిన కొత్త డేటా కమ్ ఎక్స్‌ట్రిమ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ రూ.149 ప్లాన్ మరియు అధిక డేటా కోసం రూ.148 ప్లాన్ల యొక్క ప్రయోజనాలను అందించడం జరిగింది. మరొక్కసారి ఈ ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుని, మీకు సరిపోయేవైతే గనుక, రీచార్జ్ చేసుకోండి.

Note: రూ.149 ప్యాక్ యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.