విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో తన కెరీర్ ని ప్రారంభించిన విజయ్ సేతుపతి అనతి కాలంలోనే తెలుగు, హిందీ భాషల్లో నటించారు. విజయ్ సేతుపతికి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ క్రేజ్ ఉంది.
ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం హిందీలో అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ చిత్రంతో సేతుపతి తన నట విశ్వరూపం చూపిస్తారేమో చూడాలి. విజయ్ నటించిన ఎన్నో సినిమాలు వివిధ ఓటీటీ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి చిత్రాలేవో తెలుసుకుందాం.
Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి సినిమాలు
1. డీఎస్పీ (DSP)
తమిళంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి పొన్‌రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అనుకీర్తి వ్యాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రభాకర్ విలన్ పాత్ర పోషించారు. పుగళ్, ఇళవరసు, జి. జ్ఞానసంబంధం, దీప, సింగంపులి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
2. సూపర్ డీలక్స్
ఈ చిత్రంలో తమిళం, తెలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంతా రుత్ ప్రభు, రమ్య కృష్ణన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ గా నటించారు.
3. లాభం
లాభం చిత్రంలో విజయ్ సేతుపతి, జగపతి బాబు, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ధన్సికా, కళయరసన్ కీలక పాత్రల్లో నటించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జననాదన్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషలో అందుబాటులో ఉంది. చూసి ఆనందించండి.
4. తుగ్లక్ దర్బార్
తుగ్లక్ దర్బార్ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా రూపొందింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రలు పోషించారు. మంజిమా మోహన్, కరుణాకరన్, భగవతి పెరుమాళ్, రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగులో అందుబాటులో ఉంది.
5. ఉప్పెన
ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేశారు. ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. కాకినాడ బ్రాక్‌డ్రాప్ లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ సేతుపతి జమిందారుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












