
భారతదేశ ప్రభుత్వంచే నడపబడుతోన్న ఏకైన టెలీకామ్ సంస్థ BSNL ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే BSNL కి జనాల్లో మంచి పేరుంది. కొన్నాళ్ళుగా ప్రయివేటు టెలీకామ్ ఆపరేటర్లతో పోల్చితే BSNL వెనకబడి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందించిన ప్యాకేజీతో మళ్ళీ తన పునర్వైభవాన్ని పొందే దిశగా అడుగులు వేస్తోంది.
ఎప్పటికప్పుడు పాత్ర ప్లాన్స్ ని తీసేసి, కొత్త ప్లాన్స్ ని తన యూజర్ల కోసం తీసుకొస్తూ BSNL తనదైన శైలిలో దూసుకెళ్తోంది. తాజాగా రూ.71, రూ.104, రూ.135, రూ.395 ప్లాన్స్ కి స్వస్తి పలికిన BSNL తన కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్స్ ని తీసుకొచ్చింది. BSNL లాంచ్ చేసిన STV 269, STV 769 ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. పదండి.
BSNL STV 269 ప్రయోజనాలు
BSNL తీసుకొచ్చిన రూ.269 స్పెషల్ ట్యారిఫ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్ తో కస్టమర్ కి అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ నాన్ లోకల్ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్, డెయిలీ 2జిబి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు కస్టమర్ కి లభిస్తాయి.
BSNL రూ.269 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
BSNL రూ.269 స్పెషల్ ట్యారిఫ్ ప్లాన్ తో కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఇరోజ్ నౌ సర్వీస్, హార్డీ మొబైల్ గేమ్స్ సర్వీస్, చాలెంజ్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్, లిస్ట్‌న్ మ్యూజిక్ సేవలు, లోక్‌ధన్, జింగ్, ఆస్ట్రోటెల్ కంటెంట్ ఉచితంగా లభిస్తాయి.
BSNL STV 769 ప్రయోజనాలు
BSNL తీసుకొచ్చిన రూ.769 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిశాక ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం యూజర్ కి లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
BSNL రూ.769 అదనపు బెనిఫిట్స్
BSNL రూ.769 ప్లాన్ ద్వారా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ ప్రయోజనాలే కాకుండా, ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి ఉచిత BSNL ట్యూన్స్, ఇరోజ్ నౌ ఎంటర్టెయిన్మెంట్ సర్వీస్, హార్డీ మొబైల్ గేమ్స్ సర్వీస్, చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్, లిస్ట్‌న్ మ్యూజిక్ సర్వీస్, లోక్‌ధన్, జింగ్, ఆస్ట్రోటెల్ డిజిటల్ కంటెంట్ కస్టమర్ కి లభిస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











