లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 2V (OnePlus Nord 3)
  • 16జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ తో రానున్న OnePlus Ace 2V
  • లాంచ్ కి ముందు లీకైన OnePlus Ace 2V (OnePlus Nord 3)

గత నెలలో OnePlus Ace 2 ని చైనాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 2V డివైజ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ OnePlus Nord 3 గా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అధికార ప్రకటన ప్రకారం, OnePlus Ace 2V డివైజ్ చైనా మార్కెట్ లో మార్చి 7 న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి కొన్ని రోజుల ముందే OnePlus ప్రెసిడెంట్ Li Jie Louis కన్ఫిగరేషన్ ఆప్షన్స్ ని రివీల్ చేశారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ LPDDR5X RAM తో వస్తున్నట్లు వన్ ప్లస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. కంపెనీ షేర్ చేసిన మరొక టీజర్ ఇమేజ్ లో OnePlus Ace 2V డివైజ్ UFS 3.1 స్టోరేజీతో రానున్నట్లు స్పష్టమైంది. త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ MediaTek Dimensity 9000 చిప్సెట్ తో లాంచ్ కానుందని OnePlus సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఓసారి OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 2V: ఖరారైన స్పెసిఫికేషన్స్

 

OnePlus Ace 2V డివైజ్ 12జిబి + 256జిబి మరియు 16జిబి + 256జిబి వేరియంట్స్ లో లభించనుందని OnePlus చైనా ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సాధారణంగా అయితే 8జిబి+128జిబి ని ఆఫర్ చేస్తారు. కానీ వన్‌ప్లస్ మాత్రం 12జిబి+256జిబి ని ఆఫర్ చేస్తుండటం విశేషం.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ తో రానున్నట్లు వన్‌ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఈ ఫోన్ పంచ్-హోల్ నాచ్ డిజైన్ తో వస్తోంది. 2కే డిస్ప్లే తో పోల్చితే OnePlus Ace 2V లోని 1.5 కే డిస్ప్లే 24.4 శాతం తక్కువ పవర్ ని వాడుకుంటుంది.

OnePlus Ace 2V డివైజ్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండనుంది. OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇకపోతే ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. గతంలో OnePlus Ace 2V డివైజ్ AnTuTu డేటాబేస్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

OnePlus Ace 2V డివైజ్ కంపెనీ యొక్క సిగ్నేచర్ ఫీచర్ అయిన అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. అయితే OnePlus Ace 2V లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.