
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. అయితే, తాజాగా వచ్చిన ఓ లీక్ ద్వారా OnePlus Nord CE 3 Lite 5G యొక్క ధర వివరాలు తెలిసాయి. ఇక ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తోంది.
OnePlus Nord CE 3 Lite 5G ధర (అంచనా)
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 329 యూరోలతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర రూ.29,000 గా ఉండనుంది. ఇది బేస్ వేరియంట్ ధర అని గమనించాలి. అలాగే భారత మార్కెట్ లో ఈ ధర మారే అవకాశం ఉంది. ఇకపోతే OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ పేస్టల్ లైమ్, క్రొమాటిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అవుతున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే చాన్స్ ఉంది.
OnePlus Nord CE 3 Lite 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి భారీ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
లీక్ ప్రకారం, OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇండియా లాంచ్ వివరాలు
OnePlus Nord CE 3 Lite 5G మరియు OnePlus Nord Buds 2 భారత్ లో ఏప్రిల్ 4 న లాంచ్ అవుతున్నాయి. ఈ ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాన్ని లైవ్ లో చూడవచ్చు. ఇప్పటికే అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో OnePlus Nord CE 3 Lite 5G యొక్క ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











