అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: ఎక్కువగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్లు

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4 వ తేదీన ప్రారంభమైంది. సేల్ లో భాగం వివిధ బ్రాండ్స్ కి చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. తగ్గింపు ధరలు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఇలా పలు రూపాల్లో వినియోగదారులకు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు తదితర విభిన్న శ్రేణులకు చెందిన ఉపకరణాలపై బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి.

అమెజాన్ సేల్ లో భాగంగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయ ధరకే అమ్ముడవుతున్నాయి. ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయనే వివరాలను మీకోసం ఇక్కడ అందజేస్తున్నాం. అలాగే ఈ ఫోన్లపై ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Apple iPhone 14 (128 GB)

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ఐఫోన్ 14 ఆకర్షణీయ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లో మెరుగైన ఆటో-ఫోకస్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 12ఎంపి అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫోటోజెనిక్ ఇంజిన్ మెరుగైన డీటెయిల్స్ మరియు కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదనంగా స్టేబుల్ మూవింగ్ వీడియోలను తీసేందుకు యాక్షన్ మోడ్ ఉంది. 20 గంటల వీడియో ప్లే బ్యాక్, ఏ15 బయోనిక్ చిప్సెట్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉన్నాయి.

అసలు ధర: రూ.71,999
డీల్ ధర: రూ.65,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

OnePlus Nord CE 3 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ నార్డ్ లైనప్ లో ఉన్న సూపర్ మిడ్-రేంజ్ ఫోన్. ఈ డివైజ్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా (3ఎక్స్ లాస్ లెస్ జూమ్), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.19,999
డీల్ ధర: రూ.18,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

OnePlus 11R 5G

OnePlus 11R 5G డివైజ్ ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యంత వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు. OnePlus 11R 5G లో 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ సూపర్ ఫ్ల్యూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

అసలు ధర: రూ.39,999
డీల్ ధర: రూ.38,748 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

realme narzo N55

చక్కటి ఫీచర్లతో కూడిన Realme Narzo N55 డివైజ్ ఈ సేల్ లో భాగంగా ఆకర్షణీయమైన ధరకు దొరుకుతోంది. ఈ ఫోన్ లో 6.76-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 64ఎంపి ఏఐ కెమెరా, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.10,999
డీల్ ధర: రూ.10,249 (కూపన్ డిస్కౌంట్స్ తో కలిపి)

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE Lite 5G స్మార్ట్ ఫోన్ ఉత్తమమైన మిడ్-రేంజ్ డివైజ్. ఈ ఫోన్ లో 6.59-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే ఎస్ఆర్జీబీ మరియు డిస్ప్లే పీ3 కలర్ గేముత్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి. అలెక్సా బిల్ట్ ఇన్ గా వస్తోంది.

అసలు ధర: రూ.18,999
డీల్ ధర: రూ.16,749 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)

OnePlus Nord 2T 5G

OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫకేషన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మోనో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంది.

అసలు ధర: రూ.28,999
డీల్ ధర: రూ.26,249 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)

Samsung Galaxy M13

Samsung Galaxy M13 స్మార్ట్ ఫోన్ చవకైన ఎంట్రీ లెవెల్ ఫోన్. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 4 కస్టమ్ స్కిన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Samsung Galaxy M13 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

అసలు ధర: రూ.12,999
డీల్ ధర: రూ.11,699

Oppo A78 5G

Oppo A78 5G స్మార్ట్ ఫోన్ గ్లో డిజైన్ తో వచ్చింది. దీని స్టన్నింగ్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Oppo A78 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700ఎమ్ ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ లో డ్యూయల్ అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.18,999
డీల్ ధర: రూ.17,699 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Oppo A17

Oppo A17 స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ లెదర్-ఫీల్ డిజైన్ తో వచ్చింది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్ డివైజెస్ లో ఇది మిన్నగా నిలుస్తోంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎక్స్4 రేటింగ్, 50ఎంపి+0.3ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ35 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్‌టెండెడ్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.12,499
డీల్ ధర: రూ.11,499 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)

iQOO Z7 5G

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, బిల్ట్-ఇన్ మోషన్ కంట్రోల్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 1టిబి వరకు ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీ ఆప్షన్ ఉంది. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. అలాగే 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫీచర్ ఉంది. iQOO Z7 5G డివైజ్ 7.8ఎంఎం మందం ఉండి స్లిమ్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

అసలు ధర: రూ.19,999
డీల్ ధర: రూ.18,499 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)