లీకైన Vivo V29e 5G స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్!

Highlights

  • జూన్ లో లాంచ్ కానున్న Vivo V29e 5G
  • 8జిబి/12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • ఈ ఫోన్ 80 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో, V29 సిరీస్ ని త్వరలోనే భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Vivo V29e 5G ఫోన్ స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ రివీల్ అయ్యాయి. ఈ విషయాన్ని తొలుత Pricebaba వెబ్ సైట్ గుర్తించింది. రిపోర్ట్ ప్రకారం, Vivo V29e 5G డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి V2304 అనే మోడల్ నంబర్ తో ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, Vivo V29e 5G కి సంబంధించి లీకైన సమాచారం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

Vivo V29e 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 7000 చిప్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ

  • 256జిబి స్టోరేజీ
  • 8జిబి/12జిబి ర్యామ్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 256జిబి స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 4600ఎంఏహెచ్
  • 80 వాట్ చార్జింగ్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం

  • 64ఎంపి మెయిన్ కెమెరా

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. మిగతా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Vivo V29e 5G లాంచ్ టైమ్‌లైన్

రిపోర్ట్ ప్రకారం, Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ జూన్ లో అనౌన్స్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.

Previous articleరూ.20,000 లోపు ధరలో లభించే 4K టీవీలు
Next articleరివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.