డైనమిక్ గ్లాస్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్; మే 25 న లాంచ్!

Highlights

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్న Vivo Y36 సిరీస్
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y36 సిరీస్
  • ఇండోనేషియన్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo Y36 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo Y36 5జీ మరియు Vivo Y36 4జీ. ఈ రెండు ఫోన్లు కూడా మే నెలలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ విషయం తెలిసింది. ఇకపోతే అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ ని పొందింది. అంతేకాదు కొన్ని రోజులక్రితం గీక్ బెంచ్ పై కూడా ఈ Vivo Y36 సిరీస్ కనిపించింది. ఈ సిరీస్ డైనమిక్ గ్లాస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. వివో ఇండోనేషియన్ వెబ్ సైట్ ద్వారా ఈ సిరీస్ వివరాలు తెలిసాయి.

డైనమిక్ గ్లాస్ డిజైన్, 8జిబి ర్యామ్ తో రానున్న Vivo Y36 సిరీస్

  • డైనమిక్ గ్లాస్
  • 8జిబి ర్యామ్
  • 5జీ, 4జీ
  • 44వాట్ చార్జింగ్

Vivo Y36 సిరీస్ వివరాలు వివో యొక్క అధికార వెబ్ సైట్ పై కనిపించాయి. Vivo Y36 లైనప్ డైనమిక్ గ్లాస్ డిజైన్ తో రానున్నట్లు స్పష్టమైంది. Vivo Y36 సిరీస్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్నాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్లలో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఫోన్లలో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ కనెక్టివిటీ, 4జీ కనెక్టివిటీ ఉంటాయి. Vivo Y36 4జీ విషయానికి వస్తే, ఈ ఫోన్ గ్లిట్టర్ ఆక్వాల, మిటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Vivo Y36 5జీ వేరియంట్ క్రిస్టల్ గ్రీన్, మిస్టిల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y36 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.8-ఇంచ్ స్క్రీన్
  • ఎల్సీడీ ప్యానెల్

Vivo Y36 4జీ స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇతర డిస్ప్లే సంబంధిత సమాచారం ఇంకా తెలియలేదు.

చిప్సెట్, ర్యామ్

  • మీడియాటెక్ హీలియో జీ99
  • స్నాప్ డ్రాగన్ 680
  • 8జిబి ర్యామ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. అయితే గీక్ బెంచ్ రిజల్ట్ ని బట్టి, ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా

Vivo Y36 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Vivo Y36 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ యూఐ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.

Vivo Y36 4జీ ధర

Vivo Y36 4జీ మోడల్ ధర భారత్ లో రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక Vivo Y36 5జీ స్పెసిఫికేషన్స్, ధర ఇంకా రివీల్ కాలేదు.