మనం తరచూ మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. అయితే మీ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు కూడా సంపాదించవచ్చని తెలుసా? మీరు గనుక ఫోన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్ లో, మీకోసం డబ్బు ఆర్జించేందుకు ఉపయోగపడే యాప్స్ వివరాలను అందిస్తున్నాం. వీటి ద్వారా మీరు ఆన్లైన్ లో గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
డబ్బు సంపాదించేందుకు పనికొచ్చే యాప్స్
- మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)
- పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్
- వింజో
- ఏఐఓ గేమ్స్
- డ్రీమ్ 11
MPL (మొబైల్ ప్రీమియర్ లీగ్)
- ఎమ్పీఎల్ గురించి మీరు వినే ఉంటారు. దీన్ని మొబైల్ ప్రీమియమ్ లీగ్ అని అంటారు.
- 100 మిలియన్ కి పైగా యూజర్లు ఈ యాప్ ని వాడుతున్నారు.
- ఈ యాప్ పై యూజర్లు గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
- ఫాంటసీ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ తో పాటు ఇంకా రమ్మీ, పోకర్, కాల్ బ్రేక్ అండ్ లుడో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, క్యారమ్ అండ్ చెస్ వంటి గేమ్స్ ఆడవచ్చు.
- యాప్ లోకి సైన్ ఇన్ అయ్యాక, యూజర్లకు రూ.100 బోనస్ లభిస్తుంది.
- ఎంపీఎల్ యాప్ పై సమయానుగుణంగా ఎన్నో టోర్నమెంట్లు కూడా నిర్వహించబడతాయి. వీటి ద్వారా యూజర్లు డబ్బును సంపాదించవచ్చు.
Paytm First Games
- పేటీఎమ్ గురించి మీరు వినే ఉంటారు.
- పేటీఎమ్ యొక్క పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ యాప్ కూడా ఎంపీఎల్ యాప్ లాంటిదే.
- ఈ యాప్ లో కూడా యూజర్లు లూడో, రమ్మీ, పోకర్, కాల్ బ్రేక్ వంటి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
- అలాగే పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొని ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
- మీరు గెలుచుకున్న డబ్బు మీ పేటీఎమ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
Winzo
- ఎంపీఎల్, పేటీఎమ్ ఫస్ట్ గేమ్స్ మాదిరే వింజో కూడా ఒక ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్.
- ఈ యాప్ లో యూజర్లు సమురయ్, లూడో, క్యారమ్, మెట్రో సర్ఫర్ మరియు ఇతర ఫ్యాంటసీ గేమ్స్ ని ఆన్లైన్ లో ఆడవచ్చు.
- ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ కి సైన్ అప్ అయ్యినందుకు యూజర్లకు ఇన్స్టంట్ పేటీఎమ్ క్యాష్ లభిస్తుంది.
- వింజో వెబ్ సైట్ ద్వారా గేమ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ పై ఎన్నో గేమ్స్ ని ఆడి డబ్బుని గెలుచుకోవచ్చు.
AIO Games
- ఏఐఓ గేమ్స్ యాప్ ద్వారా యూజర్లు ఆన్లైన్ లో లూడో, క్యారమ్, ఫ్యాంటసీ గేమ్స్, బాటిల్ షూట్, రమ్మీ మరియు పోకర్ వంటి గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
- ఏఐఓ గేమ్స్ ని ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ప్రతీరోజు ఈ యాప్ ద్వారా రూ.500 వరకు గెలుచుకోవచ్చు.
- ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ పై యూజర్లు కార్డ్ గేమ్స్, ఫ్యాంటసీ గేమ్స్ మరియు మరెన్నో ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చు.
Dream 11
- డ్రీమ్ 11 కూడా ఎంతో ప్రజాదరణ పొందిన ఫ్యాంటసీ గేమింగ్ యాప్.
- ఈ యాప్ 2008 లో లాంచ్ అయ్యింది.
- ఈ యాప్ ద్వారా యూజర్లు ఫ్యాంటసీ క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ వంటి గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చు.
- ఈ గేమ్స్ ఆడి యూజర్లు కోట్లలో సంపాదించినట్లు తరచూ మీరు వార్తలు చదివే ఉంటారు.

















