భారత్‌లో లాంచైన Tecno Camon 20, Camon 20 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • భారత్ లో లాంచైన Camon 20, Camon 20 Pro 5G
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ తో లాంచైన కేమాన్ 20 సిరీస్
  • 29 నుంచి మొదలు కానున్న కేమాన్ 20 సిరీస్ సేల్

భారత్ లో Tecno Camon 20 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు వచ్చాయి. అవి: Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 Premier. Tecno Camon 20 సిరీస్ స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలను ఇక్కడ అందజేస్తున్నాం. ముందుగా Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G ధర వివరాలు చూద్దాం.

Tecno Camon 20 ఇండియా ధర, సేల్ వివరాలు

Tecno Camon 20 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.14,999 గా ఉంది. మే 29 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి.

Tecno Camon 20 Pro 5G ఇండియా ధర

Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇందులో బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. జూన్ రెండో వారంలో Tecno Camon 20 Pro 5G సేల్ మొదలవుతుంది.

Tecno Camon 20, Camon 20 Pro 5G స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 64ఎంపి రియర్ కెమెరా
  • 33 వాట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • హీలియో జీ85 చిప్
  • డైమెన్సిటీ 8050 చిప్

డిస్ప్లే

  • 6.67-ఇంచ్ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 డివైజెస్ లో 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్

  • హీలియో జీ85 చిప్
  • డైమెన్సిటీ 8050 చిప్

Tecno Camon 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఇచ్చారు. Tecno Camon 20 Pro 5G లో డైమెన్సిటీ 8050 చిప్సెట్ అందించారు.

కెమెరా

  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • 64ఎంపి రియర్ కెమెరా

Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 డివైజెస్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లలో 64ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Previous articleజూన్ ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro
Next articleలీకైన Realme 11 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, ర్యామ్, కలర్ ఆప్షన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.