
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT Neo 5 Pro ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ కి ముందు Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇటీవలె ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లపై కనిపించింది. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT Neo 5 Pro డివైజ్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది.
Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని సమాచారం.
Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉన్నాయి.
- చిప్సెట్, ర్యామ్: Realme GT Neo 5 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం.
- బ్యాటరీ: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, ఉంటాయి. మెయిన్ కెమెరాలో కొత్త ఫ్యూజన్ ఆల్గారిథమ్ ఫీచర్ ఉండనుంది.
- ఓఎస్: Realme GT Neo 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











