
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia భారతీయ మార్కెట్ లో రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Nokia 110 2G, Nokia 110 4G. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకత ఏంటంటే, వీటి ద్వారా యూపీఐ పేమెంట్ కూడా చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ల ధరలు కూడా రూ.2,500 లోపే ఉన్నాయి. సరే, ఓసారి Nokia 110 2G, Nokia 110 4G ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందా పదండి.
Nokia 110 2G, Nokia 110 4G ఫోన్ల ధర, లభ్యత
- Nokia 110 4G (2023) ధరను కంపెనీ రూ.2,499 గా నిర్ణయించింది.
- Nokia 110 2G (2023) ధరను కంపెనీ రూ.1,699 గా నిర్ణయించింది.
ఇప్పుడు ఈ రెండు ఫోన్ల కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. Nokia 110 4G డివైజ్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Nokia 110 2G హ్యాండ్సెట్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్లను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా కూడా విక్రయించబడతాయి.
Nokia 110 2G, Nokia 110 4G ఫీచర్ ఫోన్ల స్పెసిఫికేషన్స్
- Nokia 110 2G, Nokia 110 4G ఫోన్లు మంచి బిల్ట్ క్వాలిటీతో వచ్చాయి.
- Nokia 110 4G లో రియర్ కెమెరా, ఎస్డీ కార్డ్ స్లాట్, మ్యూజిక్ ప్లేయర్, ఆటో కాల్ రికార్డర్, భారీ స్టోరేజీ కెపాసిటీ ఉన్నాయి.
- Nokia 110 4G లో 4జీ కనెక్టివిటీ వల్లన హెచ్డీ వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది.
- Nokia 110 4G ఫోన్ లో ఎంపీ3 ప్లేయర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి. 32జిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- Nokia 110 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
- మ్యూజిక్ లవర్స్ కోసం ఎఫ్ఎమ్ రేడియో ఫెసిలిటీ ఉంది. ఇది వైర్లెస్ టెక్నాలజీపై పని చేయడం విశేషం. అంటే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయకుండానే ఎఫ్ఎమ్ వినవచ్చు.
- Nokia 110 4G లో సెక్యూర్ స్కాన్ అండ్ పే యూపీఐ ఫెసిలిటీ ఉంది.
- Nokia 110 2G లో 1000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది మెరుగైన బ్యాకప్ ని అందించనుంది. మిగతా అన్ని ఫీచర్లు కూడా Nokia 110 4G మాదిరే ఉంటాయి.











