
Honor స్మార్ట్ ఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలోనే మళ్ళీ భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ యూట్యూబర్ ప్రకారం, Honor 90 డివైజ్ తో సదరు సంస్థ రీ-ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే Honor 90 డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Honor 90 అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ గురించి తెలుసుకుందాం పదండి.
Honor 90 భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
యూట్యూబర్ గౌరవ్ చౌదరి (టెక్నికల్ గురూజీ), Honor 90 ఇండియా లాంచ్ సమాచారం రివీల్ చేశారు. సెప్టెంబర్ లో Honor 90 డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని గౌరవ్ వెల్లడించారు. అయితే, ఈ అప్‌కమింగ్ డివైజ్ ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో Honor నుంచి వచ్చే అధికార ప్రకటనతో మరింత స్పష్టత రానుంది.
Honor 90 స్పెసిఫికేషన్స్, కలర్స్ (అంచనా)
Honor 90 ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టిప్‌స్టర్ ప్రకారం, ఇండియన్ వేరియంట్ కూడా గ్లోబల్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి ఆ వివరాలు చూద్దాం.
- డిస్ప్లే: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
- రియర్ కెమెరా: Honor 90 లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉంటుంది.
- చిప్సెట్: Honor 90 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 644 జీపీయూ ఉంటుంది.
- స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి వేరియంట్స్ లో లభించనుంది.
- ఓఎస్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వస్తోంది.
- ఇతర ఫీచర్లు: Honor 90 స్మార్ట్ ఫోన్ లో బ్లూటూత్ 5.2, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
Honor 90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా 4 కలర్ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. అవి: పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్. యూట్యూబ్ వీడియోలో టిప్‌స్టర్ ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ ని చూపించారు. మరి గ్లోబల్ వేరియంట్ లాగే నాలుగు కలర్ ఆప్షన్స్ లో ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా ఏమైనా మార్పులు ఉంటాయా? అనే వివరాలు రానున్న రోజుల్లో రివీల్ కానున్నాయి.











