స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Vivo Y22T

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y22T
  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Vivo త్వరలో ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y22T పేరుతో వచ్చే ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. Vivo Y22T లిస్టింగ్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y22T గీక్‌బెంచ్ లిస్టింగ్

  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన లిస్టింగ్ ద్వారా డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో రానున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 680 అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.
  • ఈ ప్రాసెసర్ పేరుని బట్టి, ఫోన్ 4జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేయనుందని అర్థమవుతోంది.
  • అలాగే లిస్టింగ్ లో స్టోరేజీ సమాచారం కూడా ఇవ్వబడింది. ఫోన్ 6జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • ఓఎస్ విషయానికి వస్తే, లిస్టింగ్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పేర్కొనబడి ఉంది.
  • Vivo Y22T డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 377 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 1501 పాయింట్లు సాధించింది.

Vivo Y22T స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Vivo Y22T స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y22T డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
  • స్టోరేజీ: Vivo Y22T స్మార్ట్ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర వేరియంట్స్ లో కూడా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Vivo Y22T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Vivo Y22T స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y22T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y22T డివైజ్ లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.