
Motorola త్వరలో తన G-సిరీస్‌ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ Motorola G84ని లాంచ్ చేయనుందని సమాచారం. ఫోన్ ప్రస్తుతం TDRA సర్టిఫికేషన్ వెబ్సైట్లో గుర్తించబడింది. దీంతో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. Moto G84 5G మొదట ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Motorola G84 యొక్క లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
Motorola G84 టీడీఆర్ఏ లిస్టింగ్
- TDRA జాబితా ప్రకారం, Motorola యొక్క Moto G84 ఫోన్ XT2347-2 మోడల్ నంబర్‌తో కనిపించింది.
- ఈ డివైస్‌లో 5జీ టెక్నాలజీ ఉంటుందని సదరు వెబ్సైట్ తన లిస్టింగ్ లో వెల్లడించింది.
- మోడల్ నంబర్, ఫోన్ పేరు మరియు 5G టెక్నాలజీ మినహా ఇతర వివరాలు ఏవీ వెల్లడి కాలేదు.
- అయితే, ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్లో మార్కెట్లోకి ప్రవేశించగలదని చెప్పబడింది.
Motorola G84 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Motorola G84 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: ఫోన్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడితే, Qualcomm Snapdragon చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
- స్టోరేజ్: స్టోరేజ్ విషయంలో స్మార్ట్‌ఫోన్ రెండు ఆప్షన్లలో ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి.
- కెమెరా: కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లెన్స్, 8-మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2-మెగాపిక్సెల్ ఇతర లెన్స్ ఇవ్వవచ్చు. అదే సమయంలో, డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా అందిస్తారని సమాచారం.
- బ్యాటరీ: బ్యాటరీ పరంగా చూస్తే, ఈ డివైజ్ లో 5000mAh బ్యాటరీని ఇవ్వవచ్చు. అయితే ప్రస్తుతం, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి సమాచారం అందలేదు.
- OS: ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ Android 13 పై పని చేస్తుంది.











