
షావోమి సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A2+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. సరే, ఓసారి Redmi A2+ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Elevate your experience with the new #RedmiA2 Plus now available in 4GB RAM and 128GB Storage.
Get seamless performance and ample space for all your precious memories.
Buy now at ₹8,499.
? https://t.co/40QZY9ZmvV pic.twitter.com/hHZ6rslN02— Redmi India (@RedmiIndia) August 23, 2023
Redmi A2+ ధర
Redmi A2+ స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో వచ్చింది. దీని ధర రూ.8,499 గా ఉంది. ఇదివరకు కంపెనీ 64జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.7,999 ధరతో సేల్ కి అందుబాటులో ఉంది. షావోమి రిటైల్ పార్ట్నర్స్, అమెజాన్, ఎంఐ.కామ్ ద్వారా Redmi A2+ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ మరియు సీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
Redmi A2+ స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi A2+ లో 6.52-ఇంచ్ హెచ్డీ+ డాట్డ్రాప్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi A2+ లో మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi A2+ డివైజ్ 4జిబి వరకు ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ సెన్సర్, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.











