యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షలు, కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా. అవును! నేటి కాలంలో వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం మంచి సంపాదనగా మారిన మాట నిజం. మీరు సృజనాత్మకంగా మరియు వీడియో షూటింగ్‌పై కొంచెం ఆసక్తి కలిగి ఉంటే, ఈ కథనంలో మేము YouTube నుండి డబ్బు సంపాదించడానికి మీకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అవగాహన తెచ్చుకోండి.
YouTube నుంచి డబ్బు సంపాదించడం ఎలా?
YouTube నుంచి డబ్బు సంపాదించాలంటే, యూట్యూబ్ లో మీరు మీ సొంత ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రింద దానికి సంబంధించిన సమాచారం అందిస్తున్నాం. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనీ ఎలా సంపాదించాలో కూడా తెలియజేస్తున్నాం. క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. ప్రకటనల ద్వారా: మీ వీడియోలు ప్రారంభానికి ముందు, మధ్యలో అలాగే చివరగా వచ్చే యాడ్స్ ద్వారా మీకు డబ్బు సమకూరుతుంది.
2. ఛానల్ సభ్యత్వం: డబ్బు చెల్లించి మీ ఛానల్ కి సభ్యత్వం తీసుకునే సబ్‌స్క్రైబర్ల ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు.
3. మెర్చ్ షెల్ఫ్: మీ వీడియోలో అగుపించే మీ బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ ని మీ ఫ్యాన్స్ బ్రౌజ్ చేసి కొనుగోలు చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
4. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్: మీ వీడియోని చూస్తున్నప్పుడు వ్యూయర్స్ ఫన్ వన్-టైమ్-యూజ్ యానిమేషన్స్ కొనుగోలు చేయవచ్చు. అదనంగా, వారు కామెంట్ బాక్స్ లో కస్టమైజ్డ్ కామెంట్స్ పోస్ట్ చేయవచ్చు. దీంతో మీకు డబ్బు సమకూరుతుంది.
5. యూట్యూబ్ ప్రీమియమ్: యూట్యూబ్ ప్రీమియమ్ మెంబర్స్ మీ వీడియోని చూస్తే గనుక మీకు సబ్‌స్క్రిప్షన్ ఫీ నుంచి కొంత భాగం అందుతుంది.
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేందుకై ఏం కావాలి?
YouTube ద్వారా డబ్బు సంపాదించాలంటే, మీరు కొన్ని యూట్యూబ్ నిబంధనలను పాటించాలి. మీరు యూట్యూబ్ యొక్క మానిటైజేషన్ పాలసీని ఫాలో కావాల్సి ఉంటుంది. అంతేకాదు, వీటితో పాటు, మీ ఛానల్ మరికొన్నింటిని సాధించాల్సి ఉంటుంది. అవేంటో క్రింద ఇస్తున్నాం. తెలుసుకోండి.
1. మీ యూట్యూబ్ ఛానల్ కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండాలి.
2. మీ యూట్యూబ్ ఛానల్ కి 4,000 గంటల వ్యూస్ ఉండి తీరాలి. ఇది ఒక ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
3. దీంతో పాటు ఇంకా 3 నెలల్లో యూట్యూబ్ షార్ట్స్ పై 10 లక్షల వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.
4. మీ ఛానల్ పై ఎటువంటి కాపీ రైట్ లేదా కమ్యూనిటీ స్టాండర్డ్ స్ట్రైక్ ఉండకూడదు.
5. మీ ఛానల్ యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించకూడదు.
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా?
YouTube ఛానల్ క్రియేట్ చేసేందుకై మీకు ఒక జీమెయిల్ ఐడీ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేందుకు మీరు ఈ క్రింద స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
స్టెప్ 1: తొలుత మీరు, మీ ల్యాప్‌టాప్ లో యూట్యూబ్ తెరిచి, జీమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: ఇప్పుడు మీరు కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ ఫోటో పై క్లిక్ చేయండి. ఇప్పుడు యూవర్ ఛానల్ ఆప్షన్ పై క్లి చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు మీ ఛానల్ ని కస్టమైజ్ చేసుకోవాలి. ఇందుకోసం, మీరు కస్టమైజ్ ఛానల్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: ఇప్పుడు మీ కంప్యూటర్ పై ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇది మిమ్మల్ని యూట్యూబ్ స్టూడియోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ ఛానల్ ప్రొఫైల్ మరియు కవర్ ఇమేజ్ ని మార్చుకునే వీలుంటుంది. ఇక్కడే మీరు మీ ఛానల్ పేరుని కూడా మార్చుకోవచ్చు. అందుకోసం మీరు కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 5: ఫోటోని మార్చేందుకు, మీరు బ్రాండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ప్రొఫైల్, కవర్ ఇమేజ్ మార్చుకునే ఆప్షన్స్ ఉంటాయి. దీంతోపాటు, వీడియో వాటర్‌మార్క్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.
స్టెప్ 6: వీటి పైన మీకు బేసిక్ ఇన్ఫో ఆప్షన్ కనిపిస్తుంది. దీని సాయంతో మీరు మీ ఛానల్ పేరుని, హ్యాండిల్ ని మార్చుకోవచ్చు. దీంతో పాటు మీరు మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ కూడా రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆడిషనర్స్ కి మీ ఛానల్ గురించి సమాచారం తెలుస్తుంది. ఈ ఆప్షన్ తో మీరు మీ ఛానల్ ని ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) వంటి సోషల్ మీడియా మాధ్యమాలతో కనెక్ట్ చేయవచ్చు.
అన్ని అవసరమైన సెట్టింగ్స్ ని పూర్తి చేశాక, మీ యూట్యూబ్ ఛానల్ సిద్ధమవుతుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో క్రియేట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడమే. యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడంతోనే డబ్బులు రావు. అందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
యూట్యూబ్ వీడియో చేయడానికి ఏం కావాలి?
- కెమెరా: వీడియో తీసేందుకు మీకు కచ్చితంగా కెమెరా కావాలి. మీరు కావాలంటే, మీ మొబైల్ ఫోన్ కెమెరాను కూడా ఉపయోగించవచ్చు.
- మైక్: మీ వీడియోలో చక్కటి సౌండ్ ఉండాలంటే, మైక్ ఉండటం తప్పనిసరి.
- లైట్: వీడియోపై లైటింగ్ ప్రభావం చాలా ఉంటుంది. మీరు గనుక అట్రాక్టివ్ వీడియోలు రూపొందించాలంటే మంచి లైట్స్ కొనుగోలు చేయడం అవసరం.
- కంప్యూటర్: వీడియోను ఎడిట్ చేయడానికి మీకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అవసరమవుతాయి.
- వీడియో ఎడిట్ సాఫ్ట్‌వేర్: మీరు వీడియోలను ఎడిట్ చేయడానికి మీకు వీడియో ఎడిట్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఇంటర్నెట్ లో ఎన్నో రకాల వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉన్నాయి.
- ఇంటర్నెట్ కనెక్షన్: వీడియోని అప్‌లోడ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం పడుతుంది.
యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన మరియు దానిపై ట్యాక్స్
YouTube నుంచి వచ్చే సంపాదనని వ్యాపార ఆర్జనగా పరిగణిస్తారు. మీ మొత్తం యూట్యూబ్ సంపాదన రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు సదరు యూట్యూబర్ ఖాతా ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 44ఏబి సెక్షన్ క్రింద ఆడిట్ చేయబడుతుంది. ఈ పని రిజిస్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా చేయబడుతుంది.
యూట్యూబ్ ఏ విధంగా చెల్లిస్తుంది?
యూట్యూబ్ లో అడ్వర్టైజింగ్ ద్వారా ప్రధానంగా ఆర్జన ఉంటుంది. ఇది కాకుండా, నెలవారీ యూట్యూబ్ ప్రీమియమ్ మెంబర్షిప్ ద్వారా కూడా డబ్బు సమకూరుతుంది.











