Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro

Highlights

  • భారత్ లో లాంచైన Google Pixel 8 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Pixel 8, Pixel 8 Pro
  • Google Pixel 8 ధర రూ.75,999

ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నేడు భారత్ లో Google Pixel 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. లైనప్ లో భాగంగా Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Google Pixel 8 సిరీస్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Google Pixel 8 Pro, Google Pixel 8 డివైజెస్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Google Pixel 8, Google Pixel 8 Pro ధర

Google Pixel 8 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.75,999 గా ఉంది. Google Pixel 8 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.1,06,999 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు అక్టోబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-బుకింగ్ కి అందుబాటులోకి రానున్నాయి.

Google Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 Pro లో 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1344*2992 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 Pro లో టెన్సర్ జీ3 చిప్సెట్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జత చేశారు.

కెమెరా: Google Pixel 8 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ ప్రైమరీ లెన్స్, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 48ఎంపి 30x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Google Pixel 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Google Pixel 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనుంది. అంటే రాబోవు ఎన్నో ఆండ్రాయిడ్ వర్షన్స్ ఈ ఫోన్ లో రన్ అవుతాయన్నమాట.

Google Pixel 8 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 లో 6.2-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 లో టెన్సర్ జీ3 చిప్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జతచేశారు.

కెమెరా: Google Pixel 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10.5 ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

ఓఎస్: Google Pixel 8 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ పొందనుంది.

బ్యాటరీ: Google Pixel 8 లో పవర్ బ్యాకప్ కోసం 4,575 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 27 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 18 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.