తెలంగాణలో Airtel 5G Plus వినియోగదారులు 30 లక్షలు దాటినట్లు ప్రకటించిన Airtel

Highlights

  • తెలంగాణలోని 33 జిల్లాల్లో అందుబాటులోకి Airtel 5G Plus
  • 3 మిలియన్లకు చేరుకున్న Airtel 5G Plus కస్టమర్లు
  • కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎయిర్టెల్

దేశంలోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్, జియోకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఓ మైలురాయిని దాటింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ కస్టమర్లు తెలంగాణలో 3 మిలియన్లు దాటారని ఆ సంస్థ ప్రకటించింది. ఎయిర్టెల్ 5జీని లాంచ్ చేసిన కేవలం 12 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్టెల్ 5జీ సేవలు విస్తరించినట్లు తెలిపింది. TelecomTalk ఎయిర్టెల్ అఛీవ్మెంట్ కి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 5జీ యూజర్లు 2 మిలియన్లకు చేరుకున్నారని మే నెలలో ఎయిర్టెల్ ప్రకటించింది. తాజాగా ఒక్క తెలంగాణలోనే 3 మిలియన్ల 5జీ యూజర్ మార్క్ ని చేరామని ఎయిర్టెల్ ప్రకటించడం విశేషం.

Airtel 5G లభ్యత

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని అన్ని జిల్లాకు 5జీ సేవలను చేరేలా, తమ నెట్వర్క్ ని పెద్దఎత్తున విస్తరించామని కంపెనీ వెల్లడించింది.

తెలంగాణలో Airtel 5G

చారిత్రాత్మక ప్రదేశాలు గోల్కొండ, చార్మినార్, టెంపుల్ సిటీ వరంగల్, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మారుమూల గ్రామం అంజనాపురం లకు తమ 5జీ నెట్వర్క్ విస్తరించిందని ఎయిర్టెల్ తెలిపింది. తమ 5జీ రోలౌట్ ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఎయిర్టెల్ తెలిపింది.

తాజా మైలురాయిపై భారతి ఎయిర్టెల్ సంస్థ ఈ విధంగా స్పందించింది. “రాష్ట్రంలో హై-స్పీడ్ 5జీ టెక్నాలజీని తీసుకొచ్చిన మొట్టమొదటి టెలీకామ్ సంస్థ మాదే. నేడు కస్టమర్ల జీవితాలను జోడించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఎయిర్టెల్ 5జీ ప్లస్ నెట్వర్క్ వాడుతోన్న 3 మిలియన్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.”

Previous articleAMOLED డిస్ప్లే, 16GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Open
Next articleVivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.