
Xiaomi సబ్-బ్రాండ్ Redmi తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది. ఇది Redmi K70 పేరుతో చైనాలో విడుదల కానుంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని చర్చ జరుగుతోంది. మరోవైపు, భారతదేశంలో రెడ్మి కె70 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు కూడా వస్తున్నాయి, ఈ స్మార్ట్‌ఫోన్‌ను POCO F6 పేరుతో భారతదేశంలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
Redmi K70 ఇండియా లాంచ్ వివరాలు
చైనాలో లాంచ్ చేయబోతున్న రెడ్మి కె70ని కంపెనీ ‘పోకో’ బ్రాండ్‌తో ఇండియాలో తీసుకురావచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. రెడ్మి కె70 పేరుతో ఈ మొబైల్ చైనాలో లాంచ్ కానుండగా, భారత్ లో POCO F6 పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, ఈ రెండు డివైజెస్ మధ్య బ్రాండ్ పేరు మార్పు తప్పితే, ఇతర ఫీచర్లు, లుక్, స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయని అంచనా.
POCO F6 ఇండియన్ సర్టిఫికేషన్ లిస్టింగ్
ఇటీవల ఇండియన్ సర్టిఫికేషన్ సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్)లో పోకో ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2311DRK481తో లిస్ట్ అయ్యింది. మరోవైపు, Redmi K70 ఇప్పటికే మోడల్ నంబర్ 2311DRK48Cతో అనేక సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. రెండు మొబైల్ల మోడల్ నంబర్లు కూడా ఈ డివైజెస్ ఒకటేనని స్పష్టం చేస్తున్నాయి. అటువంటి తరుణంలో, Redmi K70 డివైజ్ Poco F6 పేరుతో భారతదేశంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Redmi K70/POCO F6 స్పెసిఫికేషన్స్ (లీక్)
- ప్రాసెసర్: Redmi K70 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం. 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఈ చిప్ 3.36గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్ కలిగి ఉంటుంది.
- ఓఎస్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Redmi K70 డివైజ్ త్వరలోనే చైనాలో లాంచ్ అవుతుందని వార్తల ద్వారా తెలుస్తోంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో Redmi K70 లాంచ్ కానుందని సమాచారం. ఇదే మెమొరీతో POCO F6 కూడా భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.












