త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G; సీ-సిరీస్‌లో రియల్మీ నుంచి మొదటి 5G ఫోన్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme C65 5G
  • సీ-సిరీస్ లో మొదటి 5జీ డివైజ్
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ

గత నెల రోజుల నుంచి పెద్దగా మొబైల్ ఫోన్ లాంచెస్ లేవనే చెప్పాలి. అయితే డిసెంబర్ సమీపిస్తోన్న తరుణంలో మళ్ళీ ఫోన్ల విడుదల మరోసారి ప్రారంభం కానుంది. డిసెంబర్ 12 న iQOO 12 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా రియల్మీ నుంచి మొదటి సీ-సిరీస్ 5జీ ఫోన్ రాబోతున్నట్లు 91మొబైల్స్ కి సమాచారం అందింది. Realme C65 5G పేరుతో రానున్న ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Realme C65 5G వివరాలు (ఎక్స్‌క్లూజివ్)

ప్రస్తుతం Realme C65 5G ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాలు ఏమీ తెలియలేదు. కానీ, 91మొబైల్స్ కి అందిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ప్రకారం, రియల్మీ సంస్థ Realme C65 5G ఫోన్ ని 2 కలర్ వేరియంట్స్, 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ చేయనుంది. RMX783IN అనే మోడల్ నంబర్ ని Realme C65 5G కలిగి ఉంది. పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Realme C65 5G డివైజ్ 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. Realme C65 5G ఫోన్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C65 5G లాంచ్ టైమ్‌లైన్

Realme C65 5G లాంచ్ తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఈ ఫోన్ ని తీసుకొస్తారని అంచనా. అంటే కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య పెట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే Realme C-సిరీస్ లో మార్కెట్ లో పలు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme C1, C51, C53, C55 డివైజెస్ జనాల్లో పాపులర్ అయ్యాయి.

Previous article8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Tecno Spark Go 2024
Next articleGeekbench పై లిస్టైన Redmi K70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.