
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor తన స్వదేశం చైనాలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ డివైజెస్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Honor 100, Honor 100 Pro ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Honor 100, Honor 100 Pro ధరలు, సేల్ వివరాలు
- Honor 100 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,499 (సుమారు రూ.29,600) గా ఉంది.
- Honor 100 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ.33,200)
- Honor 100 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.35,500) గా ఉంది.
- Honor 100 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,399 (సుమారు రూ.40,300) గా ఉంది.
- Honor 100 Pro 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,699 (సుమారు రూ.43,800) గా ఉంది.
- Honor 100 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 3,999 (సుమారు రూ.47,400) గా ఉంది.
- Honor 100 Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,399 (సుమారు రూ.52,100) గా ఉంది.
- Honor 100, Honor 100 Pro డివైజెస్ పర్పుల్, బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెండు ఫోన్లలో తేడా ఏంటంటే, ప్రో మోడల్ లో ఓవల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ లో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
Honor 100 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor 100 లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ అల్ట్రా-హై పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor 100 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Honor 100 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Honor 100 లో 50ఎంపి సోసి ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్-వైడ్-యాంగిల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్: Honor 100 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: Honor 100 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Honor 100 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor 100 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor 100 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor 100 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 12ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Honor 100 Pro డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: Honor 100 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











