8GB ర్యామ్, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Huawei Enjoy 70

Highlights

  • చైనాలో లాంచైన Huawei Enjoy 70
  • 6.75-ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Huawei Enjoy 70 ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Huawei చైనాలో తన కొత్త బడ్జెట్ ఫోన్ Huawei Enjoy 70 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.75-ఇంచ్ భారీ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. Huawei Enjoy 70 డివైజ్ తక్కువ ధరలోనే వచ్చింది. సరే, ఓసారి Huawei Enjoy 70 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Huawei Enjoy 70 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Huawei Enjoy 70 లో 6.75-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Huawei Enjoy 70 లో కిరిన్ 710ఏ చిప్సెట్ వాడారు. ఇది పవర్ఫుల్ చిప్సెట్ కాదు కానీ, చక్కటి ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Huawei Enjoy 70 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Huawei Enjoy 70 లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 22.5 ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Huawei Enjoy 70 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • ఓఎస్: Huawei Enjoy 70 డివైజ్ హార్మనీ ఓఎస్ 4 పై పని చేస్తుంది.

Huawei Enjoy 70 ధర

  • Huawei Enjoy 70 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Huawei Enjoy 70 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.14,154) గా ఉంది.
  • Huawei Enjoy 70 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.16,454) గా ఉంది.
  • Huawei Enjoy 70 స్మార్ట్‌ఫోన్ బ్రిలియంట్ బ్లాక్, స్నోయీ వైట్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.