
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X7 మరియు OPPO Find X7 Pro. తొలుత ఈ ఫోన్లు చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించవచ్చు. తాజాగా OPPO Find X7 Pro యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, స్కీమాటిక్ రెండర్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO Find X7 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్
- ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find X7 Pro యొక్క నమూనా చిత్రాన్ని చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో పై షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. రెండర్ ని గమనిస్తే, కెమెరా మాడ్యూల్ గత లీక్స్ చెప్పిన దానికి విభిన్నంగా ఉంది. అంచనా ప్రకారం ఆక్టాగోనల్ కాకుండా, సర్క్యులర్ కెమెరా ఐల్యాండ్ OPPO Find X7 Pro లో ఉంటుందని స్పష్టమవుతోంది.
- స్కీమాటిక్ రెండర్ ని గమనిస్తే కెమెరా మాడ్యూల్ లో హాజల్‌బ్లడ్ బ్రాండింగ్, డ్యూయల్ పెరిస్కోప్ లెన్సెస్ ని కనిపిస్తున్నాయి. ఇంకా పై భాగంలో ఎడమవైపున ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇది కెమెరా ఐల్యాండ్ కి బయట ఉంది.
- OPPO Find X7 Pro నమూనా చిత్రాన్ని చూస్తే, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
- డివైజ్ కి ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది. రెండర్ ప్రకారం, డిస్ప్లేలో పంచ్-హోల్ కటౌట్, ఇయర్ పీస్ ఉన్నాయి. స్లిమ్ బెజెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
- OPPO Find X7 Pro లో 6.82-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తన పోస్ట్ లో రివీల్ చేసింది.











