Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO 12 5G

Highlights

  • భారత్‌లో లాంచైన iQOO 12
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • 144Hz అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన iQOO 12

వివో సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO 12 ఫోన్ ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో భారత్ లో లాంచైన మొదటి ఫోన్ iQOO 12 కావడం విశేషం. iQOO 12 డివైజ్‌ని 30 శాతం మెరుగైన సీపీయూ పెర్ఫామెన్స్ తో తీసుకొచ్చినట్లు ఐకూ సంస్థ చెబుతోంది. ఇకపోతే, iQOO 12 డివైజ్ 6.78-ఇంచ్ 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి iQOO 12 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ఆఫర్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO 12 ధర, ఆఫర్స్

  • iQOO 12 రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.52,999 గా ఉంది.
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.57,999 గా నిర్ణయించారు.
  • హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లకు ఫోన్ కొనుగోలుపై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • దీంతో డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్లు వరుసగా రూ.49,999, రూ.54,999 కి లభిస్తాయి.
  • అమెజాన్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

iQOO 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.
  • ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Previous articleAndroid 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G
Next articleభారత్‌లో లాంచైన itel A05s 4GB+64GB వేరియంట్; ధర రూ.6,099 మాత్రమే!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.