Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20 Pro+
  • హీలియో జీ99 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Tecno Spark 20 Pro+ ధర రూ.12,000 ఉండే ఛాన్స్

తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్లను తీసుకొచ్చే Tecno సంస్థ నుంచి త్వరలో Spark 20 Pro+ అనే ఫోన్ రానుంది. ఇప్పటకే టెక్నో Spark 20 సిరీస్ లో Tecno Spark 20C మరియు Tecno Spark 20 Pro డివైజెస్ ని సౌత్ ఈస్ట్ ఏషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు టెక్నో ఈ సిరీస్ లో టాప్ మోడల్ Tecno Spark 20 Pro+ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20 Pro+ లో డబుల్ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 Pro+ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro+ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు.
  • కెమెరా: Tecno Spark 20 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Tecno Spark 20 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతోంది.

Tecno Spark 20 Pro+ లాంచ్ వివరాలు, ధర

  • Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, 2024 జనవరిలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని టెక్నో సంస్థ కన్ఫర్మ్ చేసింది.
  • Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ ధర రూ.12,000 వద్ద ఉంటుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Previous article108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme C67 4G
Next articleడిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.