
వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 27న చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్లతో పాటు iQOO TWS 1e కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా iQOO Neo 9 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్ల డిజైన్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్లు లభించనున్నాయి. రెడ్ కలర్ వేరియంట్ డ్యూయల్ టోన్ డిజైన్ లో కనిపిస్తోంది.
స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, iQOO Neo 9 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. iQOO Neo 9 Pro వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ తో వస్తోంది.
- డిస్ప్లే: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. ప్రో వేరియంట్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్టాండర్డ్ వేరియంట్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ ఉంటుంది. iQOO Neo 9 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
- కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Neo 9 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.











