
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్ పై లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్ల యొక్క టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro, Realme 12 Pro+ టీడీఆర్ఏ లిస్టింగ్
- Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ టీడీఆర్ఏ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యాయి.
- టీడీఆర్ఏ వెబ్సైట్ లో Realme 12 Pro+ డివైజ్ RMX3840 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- స్టాండర్డ్ మోడల్ Realme 12 Pro టీడీఆర్ఏ వెబ్సైట్ లో RMX3842 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- టీడీఆర్ఏ వెబ్సైట్ లిస్టింగ్ ద్వారా Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ కి సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే 5జీ కనెక్టివిటీ మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.
- మరో విషయం ఏంటంటే, టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా Realme 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఖరారైంది.
Realme 12 Pro, Realme 12 Pro+ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
2024 ప్రథమార్థంలో Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన లేదా టీజర్ బయటకు రావాల్సి ఉంది.
Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిజైన్: Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
- ప్రాసెసర్: ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Realme 12 Pro మరియు Realme 12 Pro+ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. Realme 12 Pro+ లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ 3x లెన్స్ ఉంటుందని సమాచారం.











