
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈసారి నోట్ 13 సిరీస్ లో ఎన్నో అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ Redmi Note 13 గురించి తెలుసుకుందాం. Redmi Note 13 డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి మెయిన్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 5, ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 ధర, కలర్ ఆప్షన్స్
- Redmi Note 13 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.
- Redmi Note 13 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
- Redmi Note 13 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.
- Redmi Note 13 స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ఇండియా ద్వారా జనవరి 10 వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కూడా డివైజ్ అందుబాటులో ఉంటుంది.
- Redmi Note 13 పై పలు ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
Redmi Note 13 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
- కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
- బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











