Moto G34 5G: 120Hz డిస్ప్లే, Snapdragon 695 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటో జీ34 5జీ

Highlights

  • భారత్ లో లాంచైన Moto G34 5G
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • Moto G34 5G ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Moto G34 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G34 5G ధర, లభ్యత, ఆఫర్లు

  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
  • Moto G34 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
  • Moto G34 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది.
  • Moto G34 5G డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా జనవరి 17 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా పాత ఫోన్ పై రూ.1,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో డివైజ్ ని రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • ఇంకా కస్టమర్లు రూ.399 విలువగల జియో ప్రీపెయిడ్ ప్లాన్ పై రూ.50 క్యాష్‌బ్యాక్ వోచర్ (40) పొందవచ్చు. అలాగే అజియో పై రూ.500 డిస్కౌంట్, యాత్ర ద్వారా ఫ్లయిట్ బుకింగ్స్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 19:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బైడూ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 180 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleజనవరి 13న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Smart 8
Next articleiQOO Z9 Series: లాంచ్‌కి ముందు లీకైన ఐకూ జెడ్9 సిరీస్ రెండర్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.