Honor X6b 4G ఐఎండీఏ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ వివరాలు

Highlights

  • త్వరలో Honor X6b 4G లాంచ్
  • మోడల్ నంబర్ JDY-LX2
  • తక్కువ ధరతో రానున్న ఫోన్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor నుంచి త్వరలో ఒక 4జీ ఫోన్ లాంచ్ కానుంది. Honor X6b 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ఐఎండీఏ మరియు ఎన్బీటీసీ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇంకా హానర్ నుంచి అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓసారి Honor X6b 4G యొక్క ఐఎండీఏ మరియు ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

Honor X6b 4G ఐఎండీఏ, ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

హానర్ బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ ఎన్బీటీసీ లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ JDY-LX2 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ పై స్మార్ట్‌ఫోన్ పేరు Honor X6b 4G అని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మొబైల్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

Honor X6b 4G డివైజ్ 4జీ కనెక్టివిటీ (జీఎస్ఎమ్/డబ్ల్యూసీడీఏంఏ/ఎల్టీఈ) తో లిస్ట్ అయ్యింది.

ఐఎండీఏ లిస్టింగ్ ని గమనిస్తే, Honor X6b 4G డివైజ్ JD-LX2 మోడల్ నంబర్‌తోనే కనిపిస్తోంది.

ఫోన్ యొక్క మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర వివరాలు బయటకు రాలేదు. కానీ, లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ స్క్రీన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యాంటీ-డ్రాప్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి టర్బో ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Honor X9b 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor X9b 5G డివైజ్ ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మ్యాజిక్ టెక్స్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.