Xiaomi: కొత్త టీజర్ షేర్ చేసిన షావోమి, CiVi సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో Xiaomi CiVi సిరీస్ ఫోన్ లాంచ్
  • షావోమి నుంచి కొత్త టీజర్ విడుదల
  • Xiaomi 14 CIVI లాంచ్ అవుతుందని అంచనా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త సిరీస్ ను లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. తాజాగా ఈ సంస్థ CIVI సిరీస్ టీజర్ ని సోషల్ మీడియాలోకి వదిలింది. దీంతో త్వరలోనే భారత్ లో సీవీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే షావోమి నుంచి కేవలం హింట్ మాత్రమే వచ్చింది. ఏ ఫోన్ లాంచ్ అవ్వనుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఆ విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Xiaomi CIVI ఫోన్ ఇండియా లాంచ్ టీజర్

షావోమి తన X ఖాతాపై ఒక కొత్త వీడియోని షేర్ చేసింది. సినిమాటిక్ విజన్ అని ఆ వీడియోలో ఉంది.

ఇందులో Ci అంటే సినిమాటిక్ (‘Ci’nematic) అని, Vi అంటే విజన్ (‘Vi’sion) అని తన వీడియో ద్వారా షావోమి తెలిపింది.

Xiaomi 14 CIVI అనే కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే చైనాలో లాంచైన CIVI 4 Pro కి రీబ్రాండ్ వర్షన్ అని చెప్పవచ్చు.

ఇంకా ఫోన్ పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ రావొచ్చు.

Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి లైకా సమ్మైలక్స్ మెయిన్ సెన్సర్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Xiaomi Civi 4 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.