
నేడు భారత్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ కోసం గేమింగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మిడ్ రేంజ్ లో గేమింగ్ కి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది.
iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ లో అందించడం విశేషం. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి iQOO Neo 7 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో iQOO Neo 7 ధర
భారత్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. HDFC, ICICI, SBI కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ ని కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నేటి నుంచి అనగా ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 1 గంట నుంచి అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
iQOO Neo 7 స్పెసిఫికేషన్స్
iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.77 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
iQOO Neo 7 ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ610 జీపీయూ వినియోగించారు. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్, ఇన్‌ఫ్రారెండ్ సెన్సర్, టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












