
నేడు భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచైంది. ఈ డివైజ్ ఇప్పటికే భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఓఐఎస్ కెమెరా యూనిట్ తో రావడం Vivo Y100 ప్రత్యేకత. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన కెమెరా ఫోన్ కొనాలని భావించే వారికి Vivo Y100 మంచి ఎంపిక అవుతుంది.
Vivo Y100 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ తో లాంచైంది. ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. సరే, ఓసారి Vivo Y100 యొక్క స్పెసిఫికేషన్స్, ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo Y100 ధర, లభ్యత
భారత్ లో Vivo Y100 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా HDFC, ICICI, SBI క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది.
Vivo Y100 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. డిస్ప్లే ప్యానెల్ హెచ్డీఆర్10+ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 900 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Mali G68 GPU వినియోగించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Vivo Y100 డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Vivo Y100 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెస్ ఆడియో ఉన్నాయి.
Vivo Y100 స్మార్ట్ ఫోన్ మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.73 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













