
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో నేడు Y200e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన Vivo Y200 5G స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో రాగా, Vivo Y200e 5G డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y200e 5G ధర, పూర్తి స్పెసిపికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo Y200e 5G ధర, కలర్ ఆప్షన్స్, సేల్ వివరాలు
- Vivo Y200e 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Vivo Y200e 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.
- Vivo Y200e 5G 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.20,999 గా ఉంది.
- Vivo Y200e 5G స్మార్ట్‌ఫఓన్ బ్లాక్ డైమండ్ మరియు శాఫ్రన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Vivo Y200e 5G డివైజ్ కొనాలని భావించే వారు, వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
- ఫిబ్రవరి 27న ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.
Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y200e 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y200e 5G లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Vivo Y200e 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, ఫ్లికర్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y200e 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వచ్చింది.
- బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Y200e 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y200e 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo Y200e 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Vivo Y200e 5G డివైజ్ 163.1 మి.మీ పొడవు, 75.81 మి.మీ మందం, 7.79 మి.మీ మందం ఉంటుంది.











