100MP కెమెరాతో జులై 31న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme 11

Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 11
  • జులై 31 న గ్లోబల్ గా లాంచ్ అవుతోన్న డివైజ్
  • ఇప్పటికే భారత్ లో లాంచైన Realme 11 Pro 5G, 11 Pro+ 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ భారతీయ మార్కెట్ లో Realme 11 pro 5G, Realme 11 Pro+ 5G డివైజెస్ ని జూన్ నెలలో లాంచ్ చేసింది. అయితే Realme 11 ఇంకా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే గ్లోబల్ గా Realme 11 జులై 31 న లాంచ్ అవుతోంది. గ్లోబల్ లాంచ్ తర్వాత Realme 11 డివైజ్ భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Realme 11 విశేషాలేంటో తెలుసుకుందాం.

Realme 11 గ్లోబల్ లాంచ్

Realme 11 స్మార్ట్ ఫోన్ జులై 31 న గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ తేదీన Realme 11 వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశించనుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ విషయం ఖరారైంది. భారతీయ కాలమానం ప్రకారం, లాంచ్ ఈవెంట్ వియత్నాంలో జులై 31 న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్ ని భారతీయ యూజర్లు లైవ్ లో చూడవచ్చు. వియత్నాంలో లాంచ్ అయ్యాక, Realme 11 భారత్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

Realme 11 ధర (చైనా)

ఇప్పటికే Realme 11 చైనాలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర RMB 1,599 (సుమారు రూ.19,000). మరోవైపు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర RMB 1,799 (సుమారు రూ.21,400) గా ఉంది. భారత్ లో కూడా ఇవే ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Realme 11 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: Realme 11 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Realme 11 డివైజ్ చైనాలో 64ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యింది. అయితే వియత్నాం లో లాంచ్ అయ్యే Realme 11 లో 100 ఎంపి రియర్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. చైనా మోడల్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme 11 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో చైనాలో లాంచ్ అయ్యింది. అయితే గ్లోబల్ వేరియంట్ మాత్రం 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుడటం విశేషం.
  • కనెక్టివిటీ: Realme 11 లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.