
ప్రపంచంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఒకటి. ఈ యాప్ కి ఉన్న జనాదరణ మరే ఇతర యాప్ కి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాలు వాట్సాప్ కి అతుక్కుపోయారు. నిద్ర లేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగి తేలే జనాలే ఎక్కువ. వాట్సాప్ అనేది అన్ని వర్గాల ప్రజల ఫోన్లలో కచ్చితంగా ఉండి తీరాల్సిన యాప్ గా అవతరించింది.
వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుకోవడమే కాదు మరెన్నో లాభాలు ఉన్నాయి. వాయిస్ కాల్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు పంపుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలను టెక్ట్స్, ఫోటో లేదా వీడియోల రూపంలో స్టేటస్ గా పెట్టుకోవచ్చు.
సరే, విషయంలోకి వెళ్తే, ఫోటోలను వాట్సాప్ లో హై క్వాలిటీతో పంపండం ఎలా? మామూలుగా అయితే మనం పంపే ఫోటోలు కంప్రెస్ అయ్యి వెళతాయి. దీని వల్లన ఫోటో నాణ్యత తగ్గుతుంది. కానీ, పూర్తి నాణ్యతతో పంపేందుకు వాట్సాప్ సంస్థ ఫోటో క్వాలిటీ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా నాణ్యతతో కూడిన ఫోటోలను పంపుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఎంపిక చేయబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
మీరు గనుక అప్‌డేటెడ్ వాట్సాప్ వాడుతున్నట్లైతే, ఈ ఫీచర్ ని ఎలా వాడాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా ఒరిజినల్ సైజ్ ఫోటోను పంపడం ఎలా?
స్టెప్ 1: మీ ఫోన్ లో వాట్సాప్ తెరిచి, అందులో సెట్టింగ్స్ మెను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్స్ మెను తెరవడానికి మీరు పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల ఐకన్ పై నొక్కాలి.
స్టెప్ 3: క్రిందకు స్క్రోల్ చేస్తే, మీకు స్టోరేజీ అండ్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది.
స్టెప్ 4: ఇక్కడ మీకు మీడియా అప్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్ కనిపిస్తుంది.
స్టెప్ 5: ఇక్కడ మీకు ఆటో, బెస్ట్ క్వాలిటీ మరియు డేటా సేవర్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. హై క్వాలిటీ ఫోటో కోసం బెస్ట్ క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకోండి.
డేటా సేవర్ అంటే పేరులో ఉన్నట్లుగానే ఈ మోడ్ ద్వారా కంప్రెస్డ్ ఇమేజ్ ఫైల్స్ ని పంపుకునే వీలుంటుంది. ఇక ఆటో మోడ్ అనేది మీ నెట్వర్క్ పై ఆధారపడి ఉంటుంది. మంచి నెట్వర్క్ ఉన్నప్పుడు హై క్వాలిటీ ఇమేజెస్ ని షేర్ చేస్తుంది.
ఐఫోన్ నుంచి ఒరిజినల్ సైజ్ ఫోటోను పంపడం ఎలా?
స్టెప్ 1: మీ ఐఫోన్ పై వాట్సాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్ మెను తెరవండి.
స్టెప్ 2: సెట్టింగ్స్ సెక్షన్ లో స్టోరేజీ మరియే డేటా పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: డౌన్ స్క్రోల్ చేసి, మీడియా అప్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇందులో మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి – ఆటో, బెస్ట్ క్వాలిటీ మరియు డేటా సేవర్ ఆప్షన్. వీటిలో బెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ని ఎంచుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.










