లాంచ్‌కి ముందు లీకైన Moto G84 5G ధర

Highlights

  • సెప్టెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Moto G84 5G
  • రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన ధర
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్

Moto G84 5G ఫోన్ సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క ప్రోడక్ట్ పేజీ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యింది. లిస్ట్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు, లాంచ్‌కు ముందే, Moto G84 5G ఫోన్ ధర కూడా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Moto G84 5G ధర

Moto G84 5G ఫోన్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లిస్ట్ అయ్యింది. ఈ వేరియంట్ ధర రూ.19,999గా పేర్కొనబడింది. Motorola ఫోన్ కాస్మిక్ బ్లాక్ కలర్‌తో వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. Reliance Digital Store యొక్క ఈ పేజీ ఇప్పుడు తీసివేయబడింది. అయితే Moto G84 5G ఫోన్‌ని రేపు సెప్టెంబర్ 1న అదే ధరకు లాంచ్ చేయవచ్చని భావించవచ్చు.

Motorola G84 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Motorola G84 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, పీఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Motorola G84 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola G84 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో కూడా ఫోన్ లభించనుంది.
  • బ్యాటరీ: Motorola G84 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • 5జీ బ్యాండ్స్: Motorola G84 5G స్మార్ట్ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.