BSNL Plans: రూ.300 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్

Highlights

  • ఎన్నో చవకైన ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
  • త్వరలో లాంచ్ కానున్న బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ నెట్వర్క్స్
  • రూ.300 లోపు ధరలో లభించే బెస్ట్ ప్లాన్స్ మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో ఒకే ఒక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. చవకైన ప్లాన్స్ ని అందించడంలో BSNL ముందుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందించే ప్లాన్స్ BSNL వద్ద ఉన్నాయి. BSNL తన కస్టమర్ల కోసం వివిధ బడ్జెట్స్ సెగ్మెంట్స్ లో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ BSNL ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

రూ.300 లోపు ధరలో BSNL బెస్ట్ ప్లాన్స్

Voice 319 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL ఆఫర్ చేస్తున్న రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 64 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 10జిబి డేటా లభిస్తుంది.

STV 347 ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి.
  • అలాగే డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. 2జిబి పరిధి పూర్తయ్యాక, 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ని ఉచితంగా బ్రౌజ్ చేయవచ్చు.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. చాలెంజెస్ ఎరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ని ప్రొగ్రెసివ్ వెబ్ యాప్ పై పొందవచ్చు.

STV 399 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL తీసుకొచ్చిన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిసాక, 40 కేబీపీఎస్ వేగంపై ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ఉచిత BSNL ట్యూన్స్ తో పాటు లోక్‌ధన్ కంటెంట్ ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

STV 299 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • BSNL అందిస్తోన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత లోకల్/ఎస్టీడీ వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
  • ఇంకా డెయిలీ 3జిబి డేటా లభిస్తుంది. 3జిబి డేటా పరిమితి ముగిసాక 40కేబీపీఎస్ వేగంపై ఉచితంగా ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేయవచ్చు.
Previous articleసెప్టెంబర్ 12 న లాంచ్ కానున్న iPhone 15 సిరీస్
Next articleసెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.