Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 చిప్సెట్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో జీ-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు లీకైన ధర వివరాలు తెలుసుకుందాం.

Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని గీక్‌బెంచ్ పై తొలుత MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. లిస్టింగ్ లో డివైజ్ పేరు పేర్కొనబడి ఉంది.

Moto G85 5G ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 939 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2092 పాయింట్లు స్కోర్ చేసింది.

Moto G85 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 2+6 కోర్స్ మరియు Malmo అనే కోడ్ నేమ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ రివీల్ అయ్యింది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.30GHz. లిస్టింగ్ పై అడ్రెనో 619 జీపీయూ కనిపిస్తోంది.

చిప్సెట్ క్లాక్ స్పీడ్‌ని బట్టి, Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Moto G85 5G ధర (లీక్)

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ పై కొన్ని రోజుల క్రితం కనిపించింది. దీంతో ధర రివీల్ అయ్యింది.

యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ ప్రకారం, Moto G85 5G డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 300 యూరోలుగా ఉంది. భారత కరెన్సీలో దీన్ని రూ.26,900 అని చెప్పవచ్చు. భారత్ లో Moto G85 5G యొక్క ధర గ్లోబల్ వేరియంట్ తో పోల్చితే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

నివేదికలను బట్టి, Moto G85 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో రానున్న కొన్ని వారాల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.