OPPO: NBTC సర్టిఫికేషన్ పొందిన Reno 12 Pro

Highlights

  • త్వరలో OPPO Reno 12 Pro లాంచ్
  • మోడల్ నంబర్ CPH2629
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో అనే మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్, టీయూవీ తదితర సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 12 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్

OPPO Reno 12 Pro డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై CPH2629 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఇండోనేషియా టెలీకామ్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. అయితే ఎన్బీటీసీ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.

OPPO Reno 12 Pro యొక్క టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ద్వారా 4880 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాలతో వచ్చే అవకాశం ఉంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: OPPO Reno 12 Pro లో 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.