
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్‌లో Tecno Spark Go 1 అనే చవక ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.7,299 గా పెట్టారు. అలాగే ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి వరకు ర్యామ్ పవర్ ఉన్నాయి. ఓసారి సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Tecno Spark Go 1 సేల్ వివరాలు
Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ ధరను భారత్ లో రూ.7,299 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లపై సెప్టెంబర్ 3 నుంచి ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లోకి అందుబాటులోకి రానుంది.
Tecno Spark Go 1 కలర్ ఆప్షన్స్
ఇప్పుడు ఈ ఫోన్ కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ స్టార్‌ట్రెయిల్ బ్లాక్, గ్లిట్టరీ వైట్ మరియు లైమ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.
Tecno Spark Go 1 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Tecno Spark Go 1 లో 6.67-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, డైనమిక్ పోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Tecno Spark Go 1 లో యూనిఎస్ఓసీ టీ615 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.
సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 1 స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ పై పని చేస్తుంది. దీని వల్లన యాప్స్ తక్కువ స్టోరేజీని వాడుకుంటాయి. అలాగే బ్యాటరీ కూడా తక్కువగా ఖర్చవుతుంది. అలాగే 4 ఏళ్ళ పాటు ల్యాగ్ ఫ్రీ అనుభూతిని టెక్నో ఈ ఫోన్ ద్వారా అందిస్తోంది.
ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 1 డివైజ్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్‌కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడటం విశేషం.
కెమెరా: Tecno Spark Go 1 లో 13ఎంపి రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Tecno Spark Go 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Tecno Spark Go 1 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Tecno Spark Go 1 లో ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్, ఏఐ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ఐఆర్ బ్లాస్టర్, డీటీఎస్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.











