హైలైట్స్:
- ఆగస్టు 2 న చైనాలో ఓ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న మోటొరోలా
- మోటోరోలా రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ఫోన్స్ ని లాంచ్ చేయనున్న కంపెనీ
- 200ఎంపి కెమెరా, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ప్రత్యేకతలు
ఎన్నో రూమర్లు, లీక్స్ అనంతరం, తొలి 200 ఎంపి కెమెరా ఫోన్, మోటో ఎక్స్30 ప్రో (మోటో ఎడ్జ్30 అల్ట్రా/ గ్లోబల్ గా ఫ్రాంటియర్) తో పాటు మోటోరోలా రేజర్ 2022 ఈ ఏడాది లాంచ్ అవుతోంది. చైనా సామాజిక మాధ్యమం Weibo (via) ద్వారా మోటోరోలా లాంచ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసింది. చైనాలో ఆగస్టు 2 న ఈ ఈవెంట్ జరగబోతోంది. అంటే ఆగస్టు 10 న జరిగే శాంసంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్ కి కొన్ని రోజుల ముందే ఇది జరగనుంది.
గత వారం, మోటోరోలా రేజర్ 2022 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మోటోరోలా రివీల్ చేసింది. ఇక నిన్న రేజర్ 2022 కవర్ డిస్ప్లే యొక్క గేమింగ్ కేపబులిటీని మనకు పరిచయం చేసింది. మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా లో 200ఎంపి కెమెరా ఉండనుందని మోటరోలా కన్ఫర్మ్ చేసింది. ఇది 1/1.22 -ఇంచ్ భారీ కెమెరా సెన్సర్ కావడం విశేషం. ఈ కెమెరాతో తీసిన శాంపిల్ ను కూడా మోటోరోలా మనతో పంచుకుంది.
Motorola Launch ఈవెంట్
పైన టీజర్ లో చూపించిన విధంగా, మోటోరోలా ఆగస్టు 2 న చైనాలో ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఇదే కార్యక్రమంలో మోటోరోలా రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్లను విడుదల చేయనుంది. ఈవెంట్ రాత్రి 7.30 నుంచి ప్రత్యక్షప్రసారం అవుతుంది. మోటోరోలా 2022 క్వార్ట్జ్ బ్లాక్, ట్రాన్క్విల్ బ్లూ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుందని రూమర్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) గా ఉంటుందని అంచనా. మోటో ఎక్స్ 30 ప్రో/మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899 యూరోలు (దాదాపు రూ.71,500) ఉంటుందని తెలుస్తోంది.
Official first look ✅
Motorola Edge X30 Pro from rear#Moto #motorola pic.twitter.com/Ru9AWnKjQu— Abhishek Yadav (@yabhishekhd) July 22, 2022
Motorola Razr 2022 స్పెసిఫికేషన్స్
Motorola Razr 2022 Specifications
- 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
- 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్
- 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
- 32ఎంపి సెల్ఫీ కెమెరా
గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, మోటోరోలా రేజర్ 2022 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ ఫోల్డబుల్ ప్యానెల్, 3 అంగుళాల కవర్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.
Moto X30 Pro/Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్
Moto X30 Pro/Moto Edge 30 Ultra Specifications
- 6.73 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 144 హెర్ట్జ్ ప్యానెల్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 200ఎంపి + 50ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 60ఎంపి సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్
మోటో ఎక్స్30 ప్రో/ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్లో 6.73 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెకండరీ కెమెరా, 12ఎంపి థర్డ్ కెమెరా ఉన్నాయి.